1. ఒకే మట్టిలో పుట్టాము ఒకే భాషలో మాట్లాడుతున్నాము, ఇది చాలదా మనం అందరం కలిసి ఉండటానికి.
2. పోయినోళ్ల కోసం ఉన్నోల్లని పోగొట్టుకోలేం కదా ! అన్నటికి ఆవేశం మంచిదా ? అన్నిటికి కాలమే సమాధానం చెబుతుంది.
3. పేదోడికి కులం లేదు మతం లేదు, పెద్దోడికి మంచి లేదు, మానవత్వం లేదు.
4. అందరికి అమ్మే మొదలు, కానీ మనకోసం అన్ని వదులుకొని వచ్చేది పెళ్ళాం. వచ్చే అమ్మిని ఎంత బాగా చూసుకుంటామో మీ అమ్మ మీద అంత గౌరవం ఉన్నట్టు.
5. తప్పేదో ఒప్పేదో చెప్పనికి వయసు అవసరం లేదు.
6. మనసులో పరాకు చేరితే మనిషి ఎట్టారా కుశలంగా ఉండేది.
7. మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు. డబ్బు ఉంటే లాగేసుకుంటారు. కాని చదువుని ఎవరు తీసుకోలేరు.
8. పెద్దాడికి ఎప్పుడు ఏ భూమి అవసరం అయినా, పేదోడికి ఉండే ఆ కొంచెం భూమే ముందు కనిపిస్తుంది.
9. పిల్లల మొహం మర్చిపోయి బ్రతకడానికి మించిన శాపం కన్నోలకి ఇంకేది లేదు.
10. పగని పంచుకునే దాని కన్నా తుంచుకునేదే మేలు.
11. మనిషికి ఆది నుండి పోరాడకుండా ఎం దొరికింది. పోరాడాలంటే నిలబడాలి కదా. నిలబడితేనే కదా కలబడగలిగేది.