బీమ్,  ఈ నక్కల వేట ఎంత సేపు? కుంబస్థలన్ని బద్ధల కొడదం పద.

యుద్దాన్ని వెతుకుంటు ఆయుధాలు వాటంతట అవే వస్తాయి.

దుంగి దుంగి, నక్కి నక్కి,  గాదే తొక్కుకుంటూ పోవాలే. ఏదురువచ్చిన వాడిని వేసుకుంటూ పోవాలే.

ప్రాణం కన్నా విలువైన నీ సోపతి నా సొంతం అన్న.  గర్వంతో ఈ మన్ను లో  కలిసిపోతానే.

ఆడు కనపడితే నిప్పు కణం నిలబడినట్టు వుంటది.  కలబడితే యేగు చుక్క ఎగబడినట్టు వుంటది.  ఎదురు పడితే చావుకైనా చెమట ధారా కడతది.  ప్రాణమైన, బందువుకైనా వాడికి వాంఛానవుతాది.  ఇంటి పేరు అల్లూరి, సాకింది గోదారి, నా అన్న మన్యం దొర  అల్లూరి సీతా రామ రాజు.

వాడు కనపడితే సముద్రాలూ తడపడతాయ్. నిలపడితే సామ్రాజ్యాలు సాకిలపడతాయ్. వాడి పొగరు ఎగిరే జెండా.  వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ. వాడు భూతల్లి చనుపాలు తాగిన ముద్దు బిడ్డ. నా తమ్ముడు  గోండు బెబ్బులి కొమురం భీం.