1. తెలుగు అంటే 35 మార్కులు ముక్కి మూలిగి తెచ్చుకోవడం కాదు రా. అది మనం అమ్మతో మన బాధలని, ఆనందాన్ని పంచుకునే వారధి.
2. గెలుపేముంది రా, మహా అయితే ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది. ఒక్కసారి ఓడిపోయి చూడు, ప్రపంచం అంటే ఏంటో నీకు పరిచయం అవుతుంది.
3. దేవుడు మనుషుల్ని ప్రేమించడానికి వస్తువులని వాడుకోవడానికి సృష్టించాడు. కాని మనమే కన్ఫ్యూషన్ తో వస్తువులని ప్రేమిస్తున్నాం, మనుషుల్ని వాడుకుంటున్నాము.
4. మార్పు కోసం తాను ముందుగా మారే వాడే నాయకుడు.
5. విశ్వక్ సేనుని పుత్ర రత్నం తస్కస్కంభట్లు.
6. సైన్స్ కావాలంటే ఇంటర్నెట్లో కూడా దొరుకుతుంది. కాని సంస్కారం మీలాంటి వాళ్ళే నేర్పాలి.
7. మా తాత ఆస్థి కంటే, నేను ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేది నా ఇగో కి.
8. ఇక్కడ గడిచినా జీవితం మొత్తం నాకు కాలం విలువ ఏంటో చూపిస్తే. ఇక్కడ గడిపిన రెండు ఏళ్ళ కాలం మాత్రం నాకు జీవితం ఏంటో చూపించింది.
9. ఒక రూపాయి ఎలా ఖర్చు పెట్టాలో, మనిషిలో మనిషిని మాత్రమే ఎలా చూడాలో ఎలా కలిసిపోవాలో, ఎలా నవ్వాలో ఆఖరికి ఎలా ఏడవాలో కూడా ఇక్కడే నేర్చుకున్న.