1. ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు.. సమూహశక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్య్ర నినాదం.
2.మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, మనసులో భావన్నై, హృదయాల్లో జ్వాలనై, నా జాతి జనులు పడుకునే సమర గీతాన్నై, సామ్రాజ్యవాధ శక్తులనీ గెలుస్తాను. స్వతంత్ర భారత జయకేతనంగా నిలుస్తాను.
3. అక్కడ కాదు రా ఇక్కడ కాల్చు. వందేమాతరం… వందేమాతరం… వందేమాతం..
4.బ్రిటిష్ సామ్రాజ్యం.. ఢిల్లీ బాదుషాల ఎదుట వంగి వంగి సలాములు కొట్టినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం. నెత్తిన గుడ్డల మూటలెత్తుకుని వర్తకం పేరున ఊరూరా తిరిగినప్పుడు ఎక్కడుంది. గిడ్డంగులు కట్టుకోవడానికి ఇంత చోటు చాలని మా చంద్రగిరి రాజు దగ్గర జోలపట్టి తిరుపువెత్తినప్పుడు ఎక్కడుంది. ఎక్కడుంది రూథర్‌ఫర్డ్ మీ బ్రిటిష్ సామ్రాజ్యం.
5.రూథర్‌ఫర్డ్.. పొరపాటున కూడా అలా ఊహించవద్దు. ఇది నా మాతృభూమి. ఇక్కడి మట్టి పవిత్రం, నీరు పవిత్రం, గాలి పవిత్రం. నదులు, కొండలు సమస్తం పవిత్రం. ఈ జన్మకే కాదు.. వేయి జన్మలకైనా ఈ పుణ్యభూమిలోనే పుడతాను. నా ప్రజల సముచ్ఛరణకే పాటుపడతాను.
6.స్వరాజ్యం ఒకరిస్తే పుచ్చుకునే బిచ్చం కాదు. పోరాడి గెలుచుకునే హక్కు. రక్తమాంసాలు దారబోసి రక్షించుకోవాల్సిన వరం. నేను కోరేది సంపన్నులు, మేధావులు అనుభవించే స్వరాజ్యం కాదు. అట్టడుగున ఉన్న మనిషి కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చే స్వరాజ్యం. ఎక్కడ భయానికి చావులేదో, ఎక్కడ ప్రతి మనిషి తల ఎత్తుకొని తిరగగలడో, ఎక్కడ ఒకరి కష్టాన్ని మరొకరు కొళ్లగొట్టరో, ఏది ద్వేష అసూయలకు అతీతమైన సంఘమో అలాంటి సంఘాన్ని రామరాజ్యాన్ని నేను కోరుతున్నాను.